మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావీరుడు, బహుజన రాజ్యస్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. పాపన్నగౌడ్ సామాన్య ప్రజల కోసం,ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన బహుజన రాజ్యస్థాపన చేసి స్వరాజ్య భావన, సమానత్వం కోసం చేసిన ఉద్యమాలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.
పాపన్నగౌడ్ ధైర్యసాహసాలు, నాయకత్వ గుణాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోంద న్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితోనే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పాపన్న గౌడ్ వర్థంతి నేపథ్యంలో యువత ఆయన సేవలను స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌కు నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



