Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారాక్వాట్‌ను దేశవ్యాప్తంగా నిషేధించాలి

పారాక్వాట్‌ను దేశవ్యాప్తంగా నిషేధించాలి

- Advertisement -

రాష్ట్రంలో నిషేధంపై సీఎంకు ధన్యవాదాలు: రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
కోదండరెడ్డిని సన్మానించిన రైతు కమిషన్‌ సభ్యులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పారాక్వాట్‌ గడ్డిమందును దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో గడ్డిమందు అమ్మకాలపై కొంతకాలం నిషేధం విధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గడ్డిమందుపై నిషేధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని కోదండరెడ్డిని రైతు కమిషన్‌ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కేవీఎస్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి, భవానీరెడ్డి, భూమి సునీల్‌, తదితరులున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. అత్యంత విషపూరిత పారాక్వాట్‌ నిషేదించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషకరమన్నారు.

ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ గడ్డిమందు వల్ల వందలాది మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని వాపోయారు. రాష్ట్రంలో గడ్డి, కలుపు మందులను నిషేదించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, రైతు సంఘాల నేతలు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. పారాక్వాట్‌ను నిషేదించాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. తమ సూచన మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు కేంద్రానికి కూడా నిషేధించాలని లేఖ రాయడం శుభపరిణామం అన్నారు. ప్రాణాలకు హాని చేయని, నేల పాడుచేయని కలుపు మందులను వాడాలని రైతులకు సూచించారు. వీలైతే కలుపు తీసే యంత్ర పరికరాలు వినియోగిస్తే మంచిదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -