Friday, April 3, 2026
E-PAPER
Homeక్రైమ్భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

- Advertisement -

నెల కిందటే ప్రేమ వివాహం
మియాపూర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్‌

సోషల్‌ మీడియా పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఇష్టపడి, పెద్దలను ఒప్పించి మరీ పెండ్లి చేసుకున్నారు. కానీ పెండ్లి అయిన నెల రోజుల్లోనే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. ఎస్‌హెచ్‌ఓ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇషికయాదవ్‌(26), మధ్యప్రదేశ్‌కి చెందిన నీరజ్‌ బన్సల్‌కు 2020లో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

వివాహానంతరం దంపతులు మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేట్‌ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, కొద్దిరోజులుగా అదనపు కట్నం తీసుకురావాలని భర్త నీరజ్‌ బన్సల్‌ తన భార్య ఇషికయాదవ్‌ను మానసికంగా వేదిస్తున్నాడు. దాంతో తీవ్ర మనో వేదనను గురైన ఇషికయాదవ్‌ తమ ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -