Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఘనమైన రికార్డు

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఘనమైన రికార్డు

- Advertisement -

రూ.81 లక్షల వార్షిక ప్యాకేజీతో సంచలనం
ఈ విద్యా సంవత్సరంలో 6,300 ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు
4,750 మందికి ప్లేస్‌మెంట్స్‌
ఈ నెల 4న హైదరాబాద్‌లో
11న విజయవాడ క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్‌ విజయోత్సవాలు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి ఘనమైన రికార్డులు సాధించారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్ట్‌ పార్ట్‌ కంపెనీలో రూ. 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించారు. అలాగే వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌లో రూ. 52 లక్షలు, రూ.44 లక్షలు, రూ.40 లక్షలు, రూ.34 లక్షల వార్షిక ప్యాకేజీలను సాధించినట్టు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పార్థసారథి వర్మ తెలిపారు. అలాగే 150 మంది విద్యార్థులు రూ.25 లక్షలు, 630 మంది విద్యార్థులు రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్‌, హిటాచి, తోషిబా, అమెజాన్‌, సర్వీస్‌ నౌ, జె.పి.మోర్గాన్‌ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది యూనివర్సిటీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

మొత్తం 6,300 ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు అందాయి. 4,750 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ సాధించారని ఆయన వెల్లడించారు. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ఇంకా కొనసాగుతుందనీ, మరింత మంది విద్యార్థులకు పెద్ద ప్యాకేజీలు వచ్చే అవకాశం ఉందనీ, వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.గత 16 సంవత్సరాలుగా అర్హత పొందిన విద్యార్థులందరికీ యూనివర్సిటీ 100 శాతం ప్లేస్‌మెంట్స్‌ అందించడం గర్వకారణంగా ఉందని పార్థసారథి వర్మ చెప్పారు. ఈ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందించడంతోపాటు నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఉన్నత విద్యలో ఎప్పటికప్పుడు అత్యున్నత ప్రమాణాలను పాటించడం ద్వారా విద్యార్థులు అద్భుతమైన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సాధిస్తున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -