Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపదో తరగతి విద్యార్థినికి అస్వస్థత

పదో తరగతి విద్యార్థినికి అస్వస్థత

- Advertisement -

శ్వాస సంబంధిత సమస్యతోనే పరీక్షా కేంద్రానికి..
వెంటనే స్పందించిన కలెక్టర్‌ రాహుల్‌శర్మ
ప్రభుత్వ వాహనంలోనే ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-గణపురం

వరంగల్‌ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ జడ్పీఎస్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ తన వాహనంలో ఆస్పత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు. గణపురం మండలం గాంధీనగర్‌లోని మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువుతూ పదవతరగతి పరీక్షలు రాస్తున్న కీర్తన అనే విద్యార్థిని ఉదయం పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుంచి అలసటగా ఉందని శ్వాస ఆడటం లేదని ఇబ్బంది పడుతూ ఉంది.

ఇదే సమయంలో పరీక్షా కేంద్రం పరిశీలనకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌ విషయం తెలుసుకొని వెంటనే ప్రభుత్వ వాహనంలో తన వ్యక్తిగత సిబ్బందిని వెంట పంపి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి తిరిగి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం తిరిగి పరీక్షా కేంద్రానికి ప్రభుత్వ వాహనంలోనే పంపి పరీక్ష రాయించారు. జిల్లా కలెక్టర్‌ స్పందించిన విధానం పట్ల పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -