Sunday, April 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశముంది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -