Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంతో పాటు రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూనే రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు. “ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటికీ సౌభాగ్యం” లక్ష్యంతో అర్హులైన ప్రతి నిరుపేదకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు.

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ ఎంపిపి గాల్ రెడ్డి, సుదర్శన్, మాజీ డీసీపీ డైరెక్టర్ లింగాల కృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగరావు, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు గాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, సొసైటీ సీఈవో మహేశ్వరి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -