భారత ఐక్య యువజన సమైఖ్య రాష్ట్ర కార్యదర్శి బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యని భారత యువజన సమైఖ్య తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అక్కల బాపు యాదవ్ అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం యువైఏప్ఐ ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్ దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు.
అనంతరం బాపు మాట్లాడారు దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటాల తొలి అమరుడన్నారు. భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. కొమురయ్య 1927 ఏప్రిల్ 3న జనగామ జిల్లా దేవరపుల్ల మండలంలోని కండవెండి గ్రామంలో జన్మించారని, ఆయన చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన రాజశేఖర్, గంధం పోచయ్య, ఐలేని మల్లయ్య, బొడ్డు లింగయ్య, రాజయ్య పాల్గొన్నారు.



