Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూగజీవాలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి: డా.శివరాజ్ 

మూగజీవాలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి: డా.శివరాజ్ 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మూడు నెలలు దాటిన దూడలకు, గేదెలకు, పశువులకు, ఆరు నెలలకు ఒకసారి వ్యాధి నివారణ టీకాలు ను తప్పనిసరిగా మూగజీవాలకు వేయించాలని పశు వైద్య డాక్టర్ అనుప శివరాజ్ రైతులకు సూచించారు. ఉచిత గాలికుంటు నివా రణ టీకాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని  వల్లభరావుపల్లి,వస్పుల గ్రామాలలో పశు వైద్య సిబ్బందిచే పాడి పశువులకి మరియు దుక్కి దున్నే పశువులకి,మూడు నెలలు నిండిన ప్రతి పశువుకి ఉచితంగా 345 మూగజీవాలకు  గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

పశువులకు వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం, పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం , పని సామర్థ్యం తగ్గడం వల్ల గుర్తించవచ్చు అని రైతులకు తెలిపారు. గిట్టల మధ్యలో బొబ్బలు ఏర్పడి పుండ్లుగా మారి నొప్పి వలన మేత , నీరు తీసుకోకండి  ఉండి నిరసించి చనిపోయే ప్రమాదం  పొంచి ఉందని   పేర్కొన్నారు. టీకాలు వేసిన ప్రతి పశువుకి గుర్తింపు చెవిపోగు వేసి వాటి వివరాలు, భారత్ పశుదాన యాప్ లో ఓటీపీ ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యకమం లో సర్పంచ్ మహీన్ షేక్ జహంగీర్ ,ఉప సర్పంచ్  శ్రీనివాస్ , గ్రామ పెద్దలు  నర్సింహా, సత్యనారాయణ, పాడి రైతులు  నాగయ్య,శివ ,పశువైద్య సిబ్బంది  నర్సింలు, పాండు, గోపాలమిత్రలు మల్లేష్, యాదగిరి, వేణు గోపాల్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -