Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరికోసం ఇంటిస్థలం దానం.. త్రిపుర గవర్నర్

ఊరికోసం ఇంటిస్థలం దానం.. త్రిపుర గవర్నర్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
సమాజ సేవ కోసం, అభివృద్ధి పనుల కోసం, తన సొంత ఇంటి స్థలాన్ని గ్రామపంచాయతీకి రాసి ఇచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. మండల పరిధిలోని గానుగుబండ గ్రామపంచాయతీ కార్యాలయం శిధిలావస్థకు చేరుకోవడంతో పక్కా భవనం లేక గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు గానుగుబండ గ్రామ నివాసి, త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గురువారం రాత్రి హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి వివరించగా.. గ్రామంలోని తన ఇంటిని గ్రామపంచాయతీకి వ్రాసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -