Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామునిపట్లలో గుడ్ ఫ్రైడే

రామునిపట్లలో గుడ్ ఫ్రైడే

- Advertisement -

నవతెలంగాణ -చిన్నకోడూరు 
మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ సి.ఎస్.ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ జి. దినేష్  ప్రత్యేక ఆరాధనలు జరిపారు. యేసుక్రీస్తు తనను హింసించి సిలువ వేస్తున్న వారిని సైతం క్షమించమని దేవుడిని వేడుకున్నారని, అది ఆయన గొప్పతనమని  పేర్కొన్నారు.క్రైస్తవులందరూ యేసయ్య మార్గంలో నడుస్తూ, ఇతరుల పట్ల ప్రేమను, క్షమాగుణాన్ని కలిగి ఉండాలని భక్తులకు పిలుపునిచ్చారు.

ఈ ప్రార్థనా కార్యక్రమంలో చర్చి కమిటీ పెద్దలు, సంఘ సభ్యులు మరియు గ్రామంలోని క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని ఇబ్రహీంనగర్,అనంతసాగర్,అల్లిపూర్, చిన్నకోడూరు, మాచాపూర్ శుభ శుక్రవారం సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన మాటలు కొన్ని ఆడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -