Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం..

మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లతో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ పురపాలక సంఘాలలో జరుగుచున్న పలు అభివృద్ధి పనులపై అనగా యుఐడిఎఫ్, టి యు ఎఫ్ ఐ డి సి, అమృత స్కీం, సాస్కి స్వచ్ఛభారత్,  స్టాంపు డ్యూటీ పనులు, భవిష్యత్తులో చేపట్టబోతున్న పనుల పురోగతిపై  సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిగా పూర్తి చేయుటకు  సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేటాయించిన పనులను నిర్ణీత కాలంలోపు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయవలసిందిగా తెలిపారు.

వేసవి కాలం దృష్ట్య ఏ మున్సిపాలిటీలో కూడా వీటి ఎద్దడి ఉండకూడదని ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వీటి సరఫరా చేయవలసిందిగా అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాల్సిందిగా సూచించారు.  పట్టణంలో పారిశుద్ధ్య పనులను కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ముఖ్యంగా చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాల్సిందిగా తెలిపారు. 5 శాతం రిబేట్  విషయమై కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించి  ఆస్తిపన్ను వసూళ్లు చేయవలసిందిగా కమిషనర్లు అందర్నీ ఆదేశించారు. పన్నుల వసూలు కూడా నూటికి నూరు శాతం చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పురపాలక సంఘ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ డి ఈ ఈ, ఏఈలు, సిబ్బంది లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -