Friday, April 3, 2026
E-PAPER
Homeఖమ్మంపేద కుటుంబాలకు పెద్ద అండ కాంగ్రెస్

పేద కుటుంబాలకు పెద్ద అండ కాంగ్రెస్

- Advertisement -

– రూ. 9 లక్షల 39 వేలు వివాహ పారితోషికం అందజేత
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట 
పేదలకు పెద్ద అండగా కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజాపాలన సాగుతుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తన అధికారిక నివాసం అయిన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణం లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల ఆర్ధిక భారం తగ్గించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సహాయం అందజేస్తుందన్నారు.ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని దుబారా చేరకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ, అచ్యుతాపురం సర్పంచ్ సరిహద్దులు పోలయ్య, నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, కొనకళ్ళ చెన్నారావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -