Saturday, April 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభావనలూ, కథనాలూ, వాస్తవాలూ!

భావనలూ, కథనాలూ, వాస్తవాలూ!

- Advertisement -

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కేరళ ప్రతినిధి 2026 మార్చి 7న రాసిన కథనంలో ఇలా పేర్కొన్నారు.”గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలనా సంబంధమైన రకరకాల అవినీతి కుంభకోణాలపై ఆరోపణలు ప్రత్యారోపణలు ముఖ్యంగా ముందు కొస్తుండేవి. ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ 2.0 అలాంటి తీవ్రమైన పెద్ద వివాదాలేమీ రాకుండా చూడగలిగింది. తద్వారా వాటి చుట్టూ కాంగ్రెస్‌ రాజకీయ వాదనలు రూపొందించుకునే అవకాశం లేకుండా చేసింది. పైగా అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ప్రభుత్వ అభివృద్ధి కృషి ప్రాతిపదికగా ఎల్‌డిఎఫ్‌ 2026 ఎన్నికల వేదికను తీసుకురాగలిగింది.

2011-16 కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు భిన్నంగా గత పదేళ్ల పాలనా కాలంలో ప్రకాశమాన కేరళ ఎలా వెలుగొందిందో పోల్చిచూపింది. ఇప్పటి పాలక సంఘటన లోపాలపై యుడిఎఫ్‌ కేంద్రీకరిం చవలసిన సమయంలో ఎల్‌డిఎఫ్‌ చేపట్టిన ఈ వైఖరి కాంగ్రెస్‌ పార్టీని ఒక ఇరకాట పరిస్థితికి నెట్టింది. ఇప్పు డున్న ప్రభుత్వంపై దాడి ఎక్కుపెట్టే బదులు పదేళ్ల కిందట అధికారం కోల్పోయిన తమ పాత ప్రభుత్వ వ్యవహారాలను సమర్థించుకోవలసిన స్థితికి ఆ పార్టీ నెట్టబడింది.అంతేగాక కాంగ్రెస్‌ ఎల్‌డిఎఫ్‌ ప్రచారం చేస్తున్న అభివృద్ధిపై విమర్శ చేసేబదులు ఈ విధంగా ప్రచారం చేసుకోవడంపై దాడి చేస్తున్నది.”

వామపక్షాలకు సాపేక్షంగా చెప్పుకోదగిన బలం గల చోట్ల ఇప్పుడు వచ్చిన కీలకమైన శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పోటీపడుతున్న నమూనాల ప్రధాన సంఘర్షణను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రోడీకరించింది. భారత దేశంలో నయా ఉదారవాద వాతావరణంలో మరీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన పన్నెండేళ్ల కాలంలో ప్రధాన స్రవంతి బడా కార్పొరేట్‌ మీడియా తీరులో సమూలమైన మార్పులొచ్చాయి. బీజేపీకి కార్పొరేట్‌ శక్తులకు మధ్య అపవిత్ర కలయిక ఈ మార్పుకు దోహదకారి అయింది.

దీనికి తోడు బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల నుంచి 6,074 కోట్ల రాజకీయ విరాళం స్వీకరించందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫాం(ఎడిఆర్‌) వెల్లడించింది.2023-24లోరే కాషాయపార్టీ 2,243 కోట్ల విరాళం తీసుకున్నట్టు ఆ విశ్లేషణ వెల్లడించింది. కాంగ్రెస్‌తో సహా మిగిలిన నాలుగు రాజకీయపార్టీలన్నిటికీ కలిపి వచ్చిన దాని కంటే బీజేపీకి పదిరెట్లు అధికంగా వచ్చాయి.అలాంటి అపార మైన నిధుల లభ్యత కారణంగా కేవలం ప్రధాన మీడి యానేగాక తప్పుడు సోషల్‌ మీడియా కూడా కట్టుకథలతో విద్వేష కథనాల ప్రచారం సృష్టించగలుగుతున్నది.

రెండు వ్యూహాలు
వాస్తవికమైన వార్తానివేదికల స్థానంలో అభిప్రాయాల సృష్టించి వాటిని ఒక తరహా కథనాలతో మిళితం చేసే ప్రయత్నాలు వచ్చి కూచున్నాయి. ఇది రెండు విధాల ఉపయోగపడుతుంది.మొదటిది నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అసలైన సమస్యలు చర్చకు రాకుండా చేయడం. రెండు-అధికారంలో వున్న పాలకుల పాలనతీరుకు జవాబుదారిగా చేయడానికి నిరాకరించడమనేది బహుశా అంతకన్నా ముఖ్యమైన రెండో అంశం. ప్రపంచమంతటా ఇప్పుడు నడుస్తున్న సత్యానంతర ధోరణల సారాంశమంతా ఇదే. ఈ రోజున కొత్త రివాజు ఇదే.

కేరళలో యుడిఎఫ్‌, అలాగే దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో బీజేపీ ఇరకాటానికి కారణమేమిటో ఇదే చెప్పగలదు. అయితే ప్రత్యేకించి ఎన్నికల పోరాటాల సమయం లో ఇది ప్రజాస్వామ్య సంక్షోభాన్ని వెల్లడిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎంపిక అనేది అందుబాటులో వున్న ఎంపికల మధ్యనే చేసుకోవలసి వుంటుంది.అధికారంలో వున్నవారిపై వారి కృషి ఆధారంగా తీర్పుచెప్పాలి గానీ ముక్కముక్కలుగా తలాతోకలోని కథనాలతో అసలు సత్యాన్ని మరుగుపరచడం కుదరదు. పినరాయి విజయన్‌ ఈ వాస్తవాన్ని నొక్కి చెప్పడానికే వారిలో అంతర్గత వైరుధ్యాన్ని చీల్చి చెండాడారు.కేరళలో ప్రతిపక్షం ప్రభుత్వ పనితీరులో తప్పులను పట్టుకోవడానికి ప్రయత్నించలేక పోయిందనీ, తమ ఆరోపణలను ఏకరువు పెట్టే వాయిదా తీర్మానం తేలేకపోయిందని పేర్కొన్నారు.

ప్రధాని ప్రకటన తీరు
మొత్తంపైన ప్రస్తుత చీకటి కాలాలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న సాధారణ ధోరణి ఇది. ఎడతెగని జాప్యం తర్వాత ప్రధానమంత్రి పార్లమెంటులో చేసిన సుదీర్ఘ ప్రకటనలో చెప్పిందేమిటనేదానికంటే దాచిందేమిటన్నదే ముఖ్యమెకూ చుంది. ఈ అవాంఛనీయ అక్రమ యుద్ధానికి నిజంగా బాధ్యులె వరనే దానిపై ప్రధాని భాషణం ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. అలాగే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ఉమ్మడి దాడికి 48 గంటల ముందు ముగిసిన తన ఇజ్రాయిల్‌ పర్యటన ఎందుకు జరిగిందనే దానిపై కాస్త క్లూ కూడా ఇవ్వలేదు. ”ఇజ్రాయిల్‌ పితృభూమి,: భారత దేశం ప్రజాస్వామ్యానికి మాతృభూమి’ అన్న సూత్రీకరణకు వివరణా ఇవ్వలేదు. గాజాలో యూదు దురహంకార ఇజ్రాయిల్‌ జాతిహోమం సాగిస్తూ పశ్చిమతీరంలో జాతినిర్మూలను పాల్పడలాన్ని దాదాపు ప్రపంచ మంతా నిరసిస్తున్నది.ఈ తరుణంలో ప్రధానమంత్రి ప్రసంగంలో కోవిడ్‌-19 కాలాన్ని గురించి ప్రస్తావించి పెట్రోలియం సరఫరాలు దెబ్బతినడం, భారతీయ పరిశ్రమలకు, వినియోగదారులకు ఎల్‌ఎన్‌జి గ్యాస్‌ కొరత సమస్యలను దానివల్ల వచ్చిన సమస్యలను ఏకరువు పెట్టడం గమనించదగింది.

అసలు వాస్తవాలను పక్కకు తప్పించి ఏవో భావనలు కథనాలు ముందుకు తేవడమంటే ఇదే. వామపక్ష తీవ్రవాద సవాలును ఎదుర్కొవడంపై లోక్‌సభలో తాజాగా జరిగిన చర్చ, ప్రభుత్వం ఇచ్చిన చిత్రణ కూడా ఇందుకు మరో ముఖ్యమైన సమస్య.దానితో ముడిపడిన సామాజిక ఆర్థిక రాజకీయ సైద్ధాంతిక కోణాలను పక్కనపెట్టి కేవలం సైనికీకరణ అనే ఏకముఖ వ్యూహాన్ని తీసు కొచ్చారు.ఈ సందర్భంగా హోంమంత్రి సీపీఐ(ఎం) పుట్టుక, దాని కార్యక్రమం గురించి తనకున్న కాల్పనిక భావనలేవో కొన్ని వినిపించారు. అయితే టెర్రరిజంపై పోరాడటానికి సంబంధించిన సత్యాలను మాత్రం హోంమంత్రి చాలా అరకొరగా చెప్పారు. అత్యంత కర్కోటకమైన శాసనాలను సమర్థించుకోవడంలో విఫలమైనారు. విచ్చలవిడిగా అవినీతి వ్యాపించిన అవినీతిని ఎదుర్కోవడం ఎందుకు మొదలే కాలేదనేది గానీ, పెహల్గాంలో టెర్రరిస్టుల చొరబాటు ఎలా సాధ్యమయిందనేది గానీ వివరించలేదు.

ఎన్నికల బరిలో
అది పశ్చిమ బెంగాల్‌ అయినా, అస్సాం తమిళనాడు అయినా ఎన్నికల దశ్యం ఈప్రాథమిక లక్షణాలనే ప్రతిబింబిస్తున్నది. కార్పోరేట్‌ ప్రయోజనాలను పచ్చిగా ప్రోత్సాహించడం కోసం జనాన్ని వెళ్లగొట్ట డం, నిరాశ్రయులను చేయడం, దాన్ని కప్పిపుచ్చడం కోసం విభజనలనూ విద్వేషాలనూ రగిలించడం. ఆరెస్సెస్‌, బీజేపీల ఈ ఎన్నికల దాడిలో కీలకపాత్రధారి అస్సాం ముఖ్యమంత్రి. అక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కారును అదేపనిగా సమర్థించుకోటానికీ మణిపూర్‌లో ఎడతెగని హింసాకాండ కొనసాగడానికి ఏ విధంగాను పొంతన కుదరదు..అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో జరగనున్న ఎన్నికలు ప్రజల ఓటుహక్కు కాపాడుకోవడంతో విడదీయలేని విధంగా ఆధారవడి వున్నాయి. ఆరెస్సెస్‌ బీజేపీల నిరంతర పల్లవిగా వున్న చొరబాటుదారుల అంశంతో ఆ హక్కును కత్తిరించడానికి ప్రయత్నం జరుగుతున్నది.

ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ తీసుకొచ్చిన సర్‌ తప్పుడు విధానం ప్రయోగించబడుతోంది. అందువల్ల కేరళలో అయినా ఇతర రాష్ట్రాలలోనైనా స్పష్టంగానే బరి గీయబడివుంది. రిపబ్లిక్‌ రాజ్యాంగ మౌలిక సూత్రాల. ఆధారంగా ప్రజల జీవితాలను, జీవనోపాధి హక్కునూ కాపాడుకునేందుకు యుద్ధం జరుగుతుంది. ప్రజల జీవనోపాధికీ సమగ్ర అభివృద్ధికీ సంబంధించిన ఈ సమస్యలపై మార్పు పోరాటం ఊపందు కోవాలంటే అది వామపక్షాల ద్వారానే సాధ్యపడుతుంది.ఈ ఎన్నికల సవాళ్లు ఎదుర్కోవడంలో ప్రజల జీవనోపాధి ,ప్రజాస్వామ్యం, ఐక్యత గట్టిగా రక్షించుకునే దఢతర పోరాటం దిశగా ముందుకు సాగండి.

(ఏప్రిల్‌02 పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -