Saturday, April 4, 2026
E-PAPER
Homeఆటలుఅభిషేక్‌కు జరిమానా

అభిషేక్‌కు జరిమానా

- Advertisement -

మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత
కోల్‌కతా :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై భారీ జరిమానా పడింది. ఐపీఎల్‌లో గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘించిన అభిషేక్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. ఆర్టికల్‌ 2.3 ప్రకారం అభిషేక్‌ అభ్యంతరకర భాష వాడినట్టు మ్యాచ్‌ రిఫరీ ముందు అంగీకరించాడు. లెవల్‌ 1 తప్పిదం ప్రకారం అభిషేక్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. జరిమానాతో పాటు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను సైతం అభిషేక్‌కు విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్‌ అవుటైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏవనే అంశంపై ఐపీఎల్‌ నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు. ఈడెన్‌గార్డెన్స్‌లో 21 బంతుల్లోనే 48 పరుగులు చేసిన అభిషేక్‌.. బ్లెస్సింగ్‌ ముజరబాని ఓవర్లో అవుటై డగౌట్‌కు వెళ్తూ ఫ్రస్టేషన్‌లో మాట తూలినట్టు తెలుస్తోంది. ఈ అంశంలో రిఫరీ నిర్ణయమే అంతిమం, తదుపరి విచారణ ఉండబోదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -