చార్లెస్టన్ (యుఎస్‌ఏ) : డబ్ల్యూటీఏ టూర్ చార్లెస్టన్ ఓపెన్‌లో అమెరికా క్రీడాకారిణి మడిసన్ కీస్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో అనా (హంగరీ)పై మడిసన్ కీస్ వరుస సెట్లలో గెలుపొందింది. 6-2, 7-5తో అనాపై అలవోక విజయం సాధించింది. 6 ఏస్‌లు, 5 బ్రేక్ పాయింట్లతో మెరిసిన మడిసన్ కీస్.. 84-68తో పాయింట్ల పరంగా పైచేయి సాధించింది. అనా 6 ఏస్‌లు, 2 బ్రేక్ పాయింట్లతో పోరాడినా.. మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లటంలో తేలిపోయింది. ఉక్రెయిన్ అమ్మాయి యూలియ 6-, 6-0తో రెనెట (మెక్సికో)పై సునాయాసంగా గెలుపొందింది. ఐదు బ్రేక్ పాయింట్లతో రెచ్చిపోయిన యూలియ.. పాయింట్ల పరంగా 50-23తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. మహిళల డబుల్స్‌లో పుతినెత్సవ, ఎలిసబెత జోడీ 3-6, 7-5, 10-7తో ఎకర్టినె, రెనెటాలపై మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది.


