నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన ఆయన అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటలకు స్పూర్తిగా నిలిచిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, అనంతరం పదేండ్లపాటు బాలారిష్టాలను అధిగమించి, స్వయం పాలనను దేశానికే ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి, రాజ్యాంగపరమైన హక్కులను అందించగలిగిన నాడే, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు, త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతుందని స్పష్టం చేశారు.
దొడ్డి కొమరయ్యకు కేసీఆర్ నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



