- Advertisement -
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
- నవతెలంగాణ – రాయికల్
- పట్టణంలోని కొయ్యడి మహిపాల్ రెడ్డి ఇంటి ఆవరణలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో మొక్కజొన్న, మామిడి పంటలు నేలపాలయ్యాయని పేర్కొన్నారు. పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదని విమర్శించారు.
- రైతు భరోసా పథకాన్ని ఎకరాల పరిమితి లేకుండా ఎకరానికి రూ.6,000 చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ రైతులకు రూ.1,800 మాత్రమే లభిస్తున్నదని, దళారులు లాభపడుతున్నారని అన్నారు. రాయికల్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడాన్ని తప్పుబట్టారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20,000 పరిహారం ఇవ్వాలని, రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏప్రిల్ 15 వరకు ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



