నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రజా సమస్యలు తీర్చడానికే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సభలు నిర్వహిస్తున్నారని సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని బాపన్ భాయ్ తండ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఐదు దశల్లో అమలు కానుంది అన్నారు. గ్రామ/వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించడం, హామీల అమలు, సంక్షేమ పథకాలు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, గంజాయి డ్రగ్స్ నిర్మూలన, వడదెబ్బ తీవ్రత పై ప్రజలకు సాంస్కృతిక కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీం లీడర్ పల్లెల లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము, గంట బిక్షపతి, గడ్డం ఉదయ్, మాగి శంకర్, పాక ఉపేందర్, మద్దిరాల మంజుల, కుందమల్ల నాగలక్ష్మి, ములకలపల్లి మల్లమ్మ, సిరుపంగి రాధ, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



