ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
శ్రీ రక్షా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – బోనకల్
గ్రామాలన్నీ సంపూర్ణ ఆరోగ్య గ్రామాలుగా ఉండాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని లక్ష్యంతోటే శ్రీ రక్షా హస్పిటల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య యాత్రలో నిర్వహిస్తున్నట్లు ఖమ్మానికి చెందిన ప్రముఖ శ్రీరక్ష హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల పరిధిలోనే ఆళ్లపాడు గ్రామంలో శనివారం శ్రీరక్ష హాస్పటల్ ఆధ్వర్యంలో ప్లే కార్డుల ప్రదర్శనతో ఆరోగ్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీపీ, షుగర్, గ్యాస్ట్రో, లివర్,క్యాన్సర్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు.
గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చి పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్నారు. ప్లాస్టిక్ వాడకం, దాని దుష్పరిమాణామాలను, పర్యావరణానికి, రైతుల ఆరోగ్యానికి ముప్పుగా మారిన పారాక్వాట్ గడ్డి మందును నిషేధించడానికి ప్రభుత్వం ముందడుగు వేయడం, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఈ గడ్డి మందు నిషేధంపై పార్లమెంట్ లో గళమెత్తడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ యాత్ర చేస్తున్న డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లను గ్రామ సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతాపూర్వకంగా శాలువాతో సన్మానించారు.
ఆరోగ్య యాత్రకు సహకరించిన సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులకు, గ్రామ పెద్దలకు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండి సైదమ్మ, మాజీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పారా కోటేశ్వరరావు, బండి పుల్లయ్య, గద్దల వెంకటేశ్వర్లు, శ్రీ రక్షా వైద్య సిబ్బంది అరుణ్ కుమార్, శ్రీకాంత్, కమలాకర్, కృపా,కిరణ్, గజ్జల శ్రీనివాస్ మణికాంత్, యశ్వంత్, నాగేశ్వరరావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా ప్రజల ఆరోగ్యంతో పాటు పారాక్పాట్ గడ్డి మందును నిషేధించాలని, దీనివలన ప్రజలకు హానిక కలుగుతుందని దీనికి విరుగుడు లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే రైతులు వారికి తెలియకుండానే అనారోగ్యం బారిన పడుతున్నారని చేస్తున్న ఉద్యమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తాత్కాలిక నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వానికి గోంగూర వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంట్ లో ఎంపీ కడియం కావ్య ఈ విషయాన్ని లేవనెత్తినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



