Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లును సద్వినియోగం చేసుకోవాలి 

ఇందిరమ్మ ఇండ్లును సద్వినియోగం చేసుకోవాలి 

- Advertisement -

గ్రామ సర్పంచ్ లక్ష్మి బలరాం సింగ్ 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంను సద్వినియోగం చేసుకోవాలని బొప్పాస్ పల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మి బలరాం సింగ్ తెలిపారు. శనివారం మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామంలో 25 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. దీనితో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు. బొప్పాస్ పల్లి గ్రామంలో మొదటి విడతగా 11 ఇండ్లు మంజూరు కాగా, రెండవ విడతలు 28 ఇండ్లు మంజూరయ్యాయి. అలాగే మూడవ విడతలో మరో 25 మందికి రెండు మంజూరు కావడంతో నేడు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.

గ్రామానికి మంజూరైన ఇండ్లన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందులో 15 ఇండ్లు గృహప్రవేశంకు ఉన్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. చిన్న గ్రామమైన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవడంతో జిల్లా అధికారులు మరిన్ని ఇండ్లను మంజూరు చేయడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ, అధికారులు మంజూరు పత్రాలను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు, నాయకులు బలరాం సింగ్, దుర్గ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -