మహిళ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల
నవతెలంగాణ – కట్టంగూర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కల్పించాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ముత్యాలమ్మ గూడెం లని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు తార్పాళ్ళు, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని, రైతులకు ఇబ్బందికరంగా ఉన్న యూరియా యాప్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. యూరియా సులభంగా లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పెంజర్ల కృష్ణ,ముత్యాలమ్మగూడెం మాజీ సర్పంచ్ వనం అంజయ్య, గోగిరెడ్డి సందీప్ రెడ్డి, గాదనబోయిన లింగస్వామి, ముత్తయ్య, కట్ట యాదయ్య, రైతులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



