- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌన్
అరుణోదయ సాంస్కృతిక సమైక్య, ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో హైదరాబాద్లో జరుగు తెలంగాణ రాష్ట్ర ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ.. ఆలేరు పట్టణంలో శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. కార్మికులు, కర్షకులు, సబాండవర్గాలు హాజరై సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇక్కిరి సహదేవ్, పద్మ సుదర్శన్, ఎలగందుల సిద్దులు, మార్జోడు సిద్దేశ్వర్, నరేష్ , సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



