Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంపటి మట్టిలో వెలసిన మాణిక్యం..దాయం విక్రమ్ రెడ్డి: ఎమ్మెల్యే

వెంపటి మట్టిలో వెలసిన మాణిక్యం..దాయం విక్రమ్ రెడ్డి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
విప్లవ పోరాటాల పురిటిగడ్డ వెంపటి ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన ప్రజా నాయకుడు, దాయం విక్రం రెడ్డి అని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అని స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. శనివారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఈ మేరకు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేసిన నిస్వార్ధ రాజకీయ నాయకులు విక్రం రెడ్డి అని వారి సేవలను కొనియాడారు. తండ్రి మాటకు కట్టుబడి 1981లో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1988లో ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికయ్యారు. 2001లో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతుల కోసం ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దాయం ఝాన్సీ రెడ్డి, దాయం పృథ్వీరాజ్ రెడ్డి, మల్లు కపోతం రెడ్డి, మల్లు వంశీ రెడ్డి, పాతూరి కరుణ, గ్రామ సర్పంచ్ ఎల్లయ్య, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల కమ్యూనిస్టు మండల కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -