Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడదెబ్బ బాధితులకు ప్రభుత్వం బాసట 

వడదెబ్బ బాధితులకు ప్రభుత్వం బాసట 

- Advertisement -

మృతి చెందిన కుటుంబానికి  రూ.4 లక్షలు సహాయం
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రస్తుతం రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మండిపోతున్నాడు. వ్యవసాయ రైతులు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు, వృద్ధులు వడదెబ్బ బారిన పడే ప్రమాద ఘడియలు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు అయిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వడదెబ్బతో చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. జిల్లాలో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో గిరిజన తండాలు, చెంచుపెంటలు ఏజెన్సీ గ్రామాలు అధికంగా ఉన్నాయి. పల్లె ప్రజల అవగాహన కోసం ఈ కథనం.

వడ దెబ్బతో చనిపోతే బాదిత కుటుంబానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం ప్రభుత్వ అందజేస్తుంది. ఎక్కడైనా వడదెబ్బ కారణంగా చనిపోయిన కుటుంబాలు ఉంటే ఆర్థిక సహాయం కోసం పూర్తి వివరాలతో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పై తాసిల్దార్, ప్రభుత్వ వైద్యుడు, మండల ఎస్.ఐ త్రిసభ్య కమిటీ విచారణ చేస్తుంది. ముగ్గురు అధికారులు వేరువేరుగా విచారణ చేసి వడదెబ్బ కారణంగానే చనిపోయాడు అని నిర్ధారించి నివేదికలను జిల్లా కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు.

ఎండ తీవ్రతకు వడదెబ్బ నుండి రక్షణ తన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 4. గంటల వరకు బయట తిరగడం బంద్ చేసుకోవాలి. దాహం వేయకపోయినా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. గొడుగు, టోపీ కచ్చితంగా వినియోగించాలి.

 నిమ్మరసం శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఓఆర్ఎస్ నీళ్లు తాగుతూ ఉండాలి. సాధ్యమైనంతవరకు మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు  తినాలి. వడదెబ్బ లక్షణాలు వాంతులు, జరం, తలనొప్పి అధికంగా ఉండడం,  చర్మం ఎండిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను  సంప్రదించాలి.

ఎండ తీవ్రతకు కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: తహశీల్దార్ సైదులు, అచ్చంపేట
ఎండ తీవ్రత పెరుగుతుంది వ్యవసాయ రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వడదెబ్బ కారణంగా చనిపోతే  ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -