Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సురేందర్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్

సురేందర్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్

- Advertisement -

రూ.1.30 లక్షల ఆర్థిక సహాయం
నవతెలంగాణ- కాటారం 

మహా ముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, పంచాయతీ వార్డు సభ్యులు తిప్పనపల్లి సురేందర్ ఇటీవల గుండెపోటుతో మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు.

మహా ముత్తారం మండలం, మంథని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కలిసి సురేందర్ కుటుంబానికి రూ.1,30,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయం ద్వారా కుటుంబానికి కొంతమేర భరోసా కలుగుతుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు హర్షిని రాకేష్, మండల పార్టీ అధ్యక్షుడు మార్క రాముగౌడ్, మాజీ జెడ్పిటిసి మందల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ మెండ వెంకటస్వామి, యూత్ అధ్యక్షుడు జాతోట్ జైపాల్ నాయక్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ రాదారపు స్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఎల్మారెడ్డి అనిల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర ధరమ్ సింగ్, సర్పంచ్ జాడి రాజేష్, ఉపసర్పంచ్ తైనేని సారయ్య, హట్కర్ బికోజీ నాయక్, నాయకులు లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మీర్జా సాలర్ బేగ్, శ్రీపతి సురేష్, జంగిడి శ్రీనివాస్, మహిళా నాయకురాలు గోసిక అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -