Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరేపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్

ఆరేపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ ను సర్పంచ్ రోజా కృష్ణారావు ప్రారంభించారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి మంజూరు, ఎం ఎల్ హెచ్ పి సంగీత, ఏఎన్ఎం యాదమ్మ, చంద్రకళ, రజిత, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -