- Advertisement -
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని బైరంపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై గ్రామపంచాయతీ వేగ నియంత్రికలు 400 మీటర్లకు 24 వేగ నియంత్రికలు ఏర్పాటు చేయడంతో రహదారిపై వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. దోనూరు, కంచనపల్లి గ్రామాలకు చెందిన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్లు, బైకులపై వెళ్లే వాహనదారులు వేగ నియంత్రికాల్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురవడంతో పాటు వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



