- Advertisement -
ఎంత తీరిక!
భర్త : హాయ్ డార్లింగ్… ఈ రోజు ఇల్లంతా ఇంత నీట్గా సర్దేశావు… నీ ఫోన్లో వాట్సప్ పని చేయలేదా?
భార్య : వాట్సప్ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను.
పిల్లలు మాత్రమే…
ఒక టూరిస్ట్ ఇండియాలో పర్యటిస్తూ ఒక గ్రామం గుండా వెళ్తూ గైడ్ని ఇలా అడిగాడు…
టూరిస్ట్ : ఈ గ్రామంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా?
గైడ్ : లేదండి. అందరూ చిన్న పిల్లలే పుట్టారు
అదంతే…
భార్య : అదేంటి గత సంవత్సరం మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎర్ర గులాబి ఇచ్చారు. ఇప్పుడు తెల్ల గులాబి ఇచ్చారెందుకు?
భర్త : అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్రగులాబి.. ఇప్పుడు శాంతి కావాలి కాబట్టి తెల్లగులాబి.
- Advertisement -



