వెన్ను గాయానికి తుది స్కాన్
నవతెలంగాణ-హైదరాబాద్ :
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆసీస్ స్పీడ్‌గన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. గత ఏడాది జులైలో వెన్ను గాయంతో ఆటకు దూరమైన పాట్ కమిన్స్.. యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు ఆడాడు. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు సారథ్యం వహిస్తున్న పాట్ కమిన్స్ ఇక్కడ జట్టుతో చేరి, రెండు మ్యాచ్‌లకు డగౌట్‌లో కూర్చున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ సాధన సైతం చేశాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి కమిన్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ క్లియరెన్స్ సహా వెన్ను గాయానికి తుది స్కాన్ నిమిత్తం పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా బయల్దేరాడు. కోల్‌కతాలో గురువారం మ్యాచ్ అనంతరం కమిన్స్ స్వదేశం వెళ్లినట్టు సమాచారం. వైద్య పరీక్షల నివేదికలు సానుకూలంగా ఉంటే, ఏప్రిల్ 17న పాట్ కమిన్స్ తిరిగి సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు. ఏప్రిల్ 18న ఉప్పల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడనున్న సంగతి తెలిసిందే. పాట్ కమిన్స్ గాయంతో ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్సీ వహిస్తున్నాడు.
స్వదేశానికి పాట్ కమిన్స్
- Advertisement -
- Advertisement -



