Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం దేశానికి ఆదర్శం

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం దేశానికి ఆదర్శం

- Advertisement -

– సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆదివారం బాబూజీ 119వ జయంతి సందర్భంగా సీఎం ఆయనను గుర్తు చేసుకున్నారు. దళితుల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. పేదరికంలో పుట్టినా, తన పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, తొలి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. బాబూజీ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని సీఎం అన్నారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశానికే ఆదర్శంగా కుల గణన చేపట్టామని, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బాబూజీ ఆశయాలే తమకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -