Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబేద్కర్‌ దళిత్‌ స్టడీ సర్కిల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

అంబేద్కర్‌ దళిత్‌ స్టడీ సర్కిల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

- Advertisement -

– త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌

అంబేద్కర్‌ దళిత్‌ స్టడీ సర్కిల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ఉన్న అంబేద్కర్‌ దళిత్‌ స్టడీ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. స్టడీ సర్కిల్‌లో భోజనశాల, వసతి రూములు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితుల సామాజిక, విద్యాభివృద్ధి కోసం ఈ అంబేద్కర్‌ దళిత్‌ స్టడీ సర్కిల్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులకు, యువతకు ఎంతో ఉపయోగపడేలా ఈ స్టడీ భవన్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని అన్నారు. దళిత విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు రావడానికి అవసరమైన మార్గదర్శకత్వం, సదుపాయాలు అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కానుందని, దళిత యువత తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఈ స్టడీ సర్కిల్‌ నిలవాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట సీఎన్‌ రెడ్డి, దళిత స్టడీ సెంటర్‌ చైర్మెన్‌ మల్లేపల్లి లక్షయ్య, మాజీ చీఫ్‌ సెక్రెటరీ కాకి మాధవరావు, సీనియర్‌ సంపాదకులు రామచంద్రమూర్తి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -