– వారం పాటు విస్తృతంగా కార్యక్రమాలు
– 6న నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్.. నేచురోపతిలో మిల్లెట్ మేళా
– ఈ 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు
– అదేరోజు క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రారంభించనున్న మంత్రి
– ఎల్ఐఎన్ఏసీ సేవలు నిమ్స్‌లో అందుబాటులోకి: ఉన్నతాధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాపాలనలో భాగంగా ఆరో తేదీ నుంచి 11 వరకు హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. ఆరోతేదీన సేఫ్టీఫోకస్ డేగా గుర్తించి ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్ చేపట్టనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నేచురోపతి ఆస్పత్రిలో 40 స్టాళ్లతో మిల్లెట్ మేళా ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికెట్ల పంపిణీ, హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఉదయం ఈట్ రైట్ వాక్‌లు, మధ్యాహ్నం ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు నిర్వహించనున్నారు. ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉన్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకుగానూ నిమ్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎల్ఐఎన్ఏసీ యంత్రాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ పోర్టల్, పీసీఅండ్ పీఎన్డీజీ, ఏఆర్టీ సరోగసీ పోర్టల్స్‌ను ప్రారంభించనున్నారు. ఉత్తమ వైద్య సేవలు అందించిన వారికి అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం, ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు.8న సేఫ్ మదర్ డే పేరుతో హైదరాబాద్‌లోని బోయిగూడలోని మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నారు. జిల్లాల్లో ఏఎన్సీ పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై వర్క్‌షాప్‌ల నిర్వాహణ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించనున్నారు. ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 9న హైదరాబాద్‌లో రెడ్ రన్, జిల్లాల్లో అవగాహన ర్యాలీలు చేపడతారు. జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో వైద్య సేవలు, ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. 10న హోమియోపతి, ఆయుష్డేగా గుర్తించి యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్డేగా తలపెట్టారు. డ్రగ్స్ తీసుకో వడం వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు పెట్టనున్నారు.
ఆరోగ్య రంగ అభివృద్ధికి దోహదపడేలా హెల్త్ వీక్ నిర్వహించాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి దోహదపడేలా ఏప్రిల్ 6 నుంచి 11వ తేదీవరకు హెల్త్ వీక్‌ను నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హెల్త్ వీక్‌లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లతో శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు. హెల్త్ వీక్‌లో ప్రతి రోజు ప్రత్యేక థీమ్‌తో నిర్వహించే కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవింద్ర నాయక్ , వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి హెల్త్ వీక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



