Thursday, August 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకెన్యాలొ సఫారీ హెలికాప్టర్ ప్రమాదం.. ఏడుగురు మృతి

కెన్యాలొ సఫారీ హెలికాప్టర్ ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కెన్యాలోని సంబురు కౌంటీలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సి-కాంటుగి, ఆయన భార్య స్టెఫానీ హోలిహాన్ తో స‌హా ఒక అమెరికన్ మీడియా ఎగ్జిక్యూటివ్, నలుగురు ఇతర అమెరికన్లతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. లోయిసాబాలోని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఇవాసో నైరో నదికి హెలికాప్టర్ విహారయాత్రకు వెళుతుండ‌గా ఉదయం 9:13 గంటలకు ఈ ప్రమాదం సంభవించింద‌ని కెన్యా పౌర విమానయాన అథారిటీ తెలిపింది.హెలికాప్టర్ ప్రమాదంలో మిచెల్ సెన్సి-కాంటుగి మరణించినట్లు ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు గిల్లెర్మో లాసో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తరపున అధ్యక్షుడి కార్యాలయం నివాళులర్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -