నవతెలంగాణ – చండూరు
భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, చైర్మన్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ ఏలిశెట్టి మల్లేశం, తొలుత బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో, ముఖ్యంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో సుదీర్ఘకాలం పాటు వివిధ శాఖల మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములలో వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తెలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కటకం రమేష్, వార్డు ఆఫీసర్స్ శ్రీరాములు,సాయి రామ్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం.అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్ మహేష్,రమేష్,మంజుల,మెప్మ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
“



