పంట నష్టం ప్రభుత్వం అందించాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ – దర్పల్లి
శనివారం అర్థరాత్రి అకాల వడగాళ్ల వర్షంతో మండలంలోని, గోవింద్ పల్లి, రామడుగు, కేశరాం, దమ్మన్నపేట, భేల్య తండా, దర్పల్లి గ్రామాల రైతులకు వరిపంట నష్టం జరిగింది. ఆదివరం ఉదయం నుండి రైతులు తమ తమ పంట పొలాలవద్దకు వెళ్లి చూడగా పంట పూర్తిగా నష్టం జరిగినట్లు ఆవేదనతో కన్నీరు మున్నీరు అవుతు స్థానికంగా ఉండే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షలు ఆర్మూర్ చిన్న బాలరాజ్ దృష్టికి తీసుకెల్లగా, స్పందించి తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో ముందుగా పర్యటించి రైతులకు పరామర్శించారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారులతో మాట్లాడి పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించడంతో,హుటాహుటిన మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ తన సిబ్బందితో మండలంలో అయ్యాగ్రామాల్లో నష్టం జరిగిన పొలాల్లో రైతులతో మాట్లాడి, పంటను పరిశీలించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ మండలంలోని ఐదు గ్రామ పంచాయితీ ల పరిధిలో 480 రైతుల పంట సుమారు 819 ఎకరాల పంట నష్టం జరిగినట్లు తెలిపారు. క్షత్ర స్థాయిలో తనతోపాటు తమ సిబ్బంది రైతుల పంటలను పరిశీలించడం జరిగిందని, వారితో కలిసి మాట్లాడటం జరిగిందని అన్నారు.
పూర్తి నివేదిక ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని అన్నారు. అనంతరం చిన్న బాలరాజ్ మాట్లాడుతూ పకృతి వైఫల్యాణికి మనం చేసేది ఏంలేదు. అధికారుల నివేదిక అనంతరం గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఆదుకునే దిశగా చర్యలు తప్పకుండ తీసుకుంటామని రైతులకు మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమములో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చెలిమేల శ్రీనివాస్, అయ్యాగ్రామాల సర్పంచులు, రైతు సోదరులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.



