Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్‌

పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన బీఆర్‌ఎస్‌

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్లో మనుగడ కోల్పోతుందనే భయం మొదలైయిందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే తన జీవితం అంకితం చేస్తూ నిత్యం మంథని ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ప్రజల తరుపున పోరాటం చేస్తున్న నిజాయితీ గల నాయకుడు పుట్ట అన్నారు.

ఇది మరిచిన కాంగ్రెస్ నాయకులు పుట్టపై అనుచిత, నిరాదరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుసేటన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తే చాలు పుట్టపై ఓటు రాజకీయం చేయడం కాంగ్రెస్ వాళ్లకు కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే కళ్ళు తెరిసి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాలన్నారు. స్థాయి మరిసి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని హెచ్చరించారు. స్టూడెంట్ లీడర్ గా మొదలైన పుట్ట రాజకీయ ప్రస్థానం ఎంపిటిసి, ఎంపిపి, జెడ్పిటిసి,ఎమ్మెల్యే, జెడ్పి చైర్మన్ గా ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజానాయకుడని మరోసారి వ్యక్తిగత  విమర్శలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బానోత్ రాజ్ కుమార్ (ఢిల్లీ) , కాసర్ల రాజయ్య, లావుడ్యా శ్రీనివాస్, నాంసాని కుమార్, పోతుగంటి రవి, బానోత్ తిరుపతి, గుగులోత్ తిరుపతి, ప్రశాంత్, అజ్మీరా దేవేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -