నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కర్రే వెంకటయ్య, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, కాంగ్రెస్ నాయకులు బీజాన భాస్కర్, బండ పర్వతాలు, ఆలేరు పట్టణంలో ఆదివారం వార్డు కౌన్సిలర్లు జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంతులతో కలిసి ఒక ప్రకటనలో తెలియజేశారు. మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పిటిసిగా పనిచేసిన నీవు, అంచలంచలుగా ఎదుగుతున్న ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై, బిఆర్ఎస్ లోని కొందరు అగ్ర నాయకుల మెప్పు కోసం, తోటి కురుమ బిడ్డను విమర్శించడం తగదన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేస్తే మంచిది కాదని “ఖబర్దార్” అంటూ హెచ్చరించారు. మీ ఊర్లో సర్పంచ్ గా నువ్వు పోటీ చేస్తే, చిత్తుగా ఓడించారని ఆరోపించారు. మంత్రి పదవి వస్తుందని అక్కస్సుతో విమర్శిస్తున్నారని, సేవే లక్ష్యంగా పనిచేస్తున్న బిర్లా ఐలయ్యకు కురుమలు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సమయం నాయకులు కుళ్ళ నరసింహులు, కుళ్ళ సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.



