నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు సర్పంచ్ సావిత్రి సాయాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రావ్ 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ లో జన్మించారని తెలిపారు. భారతదేశం నాలుగవ ఉప ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. తొలి కార్మిక శాఖ మంత్రి పదవిని 1977లొ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ స్థాపించి1988లో జనతా దళ్ లో విలీనం చేశారని అన్నారు. 1986 జులై 6న ఆయన కన్నుమూశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్ సారా గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



