నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఇప్పుడు ప్రజలు గుర్తించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంపత్ కుమార్, మండల నాయకులు మల్లికార్జున రెడ్డి, సాయిలు, వెంకట శివప్రసాద్, రమేష్ పంతుల్, జాంగిర్, కృష్ణ యాదవ్, రవీందర్ రెడ్డి, ఉస్మాన్, మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -



