Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంఠాలి గ్రామాభివృద్ధే నా లక్ష్యం: సర్పంచ్

కంఠాలి గ్రామాభివృద్ధే నా లక్ష్యం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
కంఠాలి గ్రామ సర్పంచ్ నాగ్ నాథ్ సమక్షంలో గ్రామ అభివృద్ధికి కీలకమైన పని ఆదివారం విజయవంతంగా పూర్తి చేయబడింది. కంఠాలి బస్టాండ్ నుండి గ్రామం వరకు ఇరువైపులా కాలువలను తవ్వించి, శుభ్రపరిచి నీటి ప్రవాహం సజావుగా సాగేందుకు ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు చిన్న వర్షం పడినా రోడ్డు మీద నీళ్లు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. కానీ ఇప్పుడు సర్పంచ్ గారి ముందడుగు వల్ల రోడ్డు మీద నీళ్లు నిల్వ లేకుండా కాలువల ద్వారా సులభంగా బయటకు వెళ్లే విధంగా మారింది. ఈ చర్య గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, పరిశుభ్రతకు కూడా దోహదపడింది. గ్రామ ప్రజలు అందరూ సర్పంచ్ గారి కృషిని అభినందిస్తూ, వారి సేవలను ప్రశంసిస్తున్నారు.

“ప్రజల సమస్యలే మా బాధ్యత – అభివృద్ధే మా లక్ష్యం” అని మరోసారి నిరూపించిన సర్పంచ్ నాగ్ నాథ్ కు  కంఠాలి గ్రామం ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -