నవతెలంగాణ – గాంధారి
గజ్వేల్ లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రేస్ శ్రేణుల దాడి హేయమైన చర్య అని గాంధారి మాజీ జడ్పిటిసి సభ్యుడు తానాజీరావు అన్నారు. ఒక మాజీ ముఖ్య మంత్రి, ప్రతి పక్ష నేత కార్యాలయం పైనే దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ దాడి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిషత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీరావు కోరారు.
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన తానాజీ రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



