Monday, April 6, 2026
E-PAPER
Homeఖమ్మంజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ కు ఘన సన్మానం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ కు ఘన సన్మానం

- Advertisement -

హాజరైన అశ్వారావుపేట యాదవ్ నాయకులు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ కు ఖమ్మం నగరంలోని రామ కృష్ణ ఫంక్షన్ హాల్‌ లో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన యాదవ నాయకులు ఆళ్ళ నాగేశ్వరరావు, జోనెబోయిన శ్రీనివాసరావు, తుమ్మ రాంబాబు పాల్గొని ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. యాదవ సమాజ ఐక్యతతోనే మరింత అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు.

యాదవ సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాదవ సంఘసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -