Monday, April 6, 2026
E-PAPER
Homeఖమ్మంఘనంగా లక్ష్మీ గణపతి 18వ వార్షికోత్సవ వేడుకలు 

ఘనంగా లక్ష్మీ గణపతి 18వ వార్షికోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక బస్టాండ్ సెంటర్‌ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో 18 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చల్లపల్లి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి నాగరాజు, పచ్చ సత్యనారాయణ, కర్పూరపు సత్యనారాయణ, కురిశెట్టి నాగబాబు నాయుడు(స్వామి), బుక్కూరి బుచ్చిబాబు, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. హోమ కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -