బుక్కపురం మహేష్
జగ్జివన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు
నవతెలంగాణ – అచ్చంపేట
దేశానికి అపార సేవలు అందించిన మహానేత, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు డా బాబు జగ్జివన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని జగ్జీవన్ జయంతి ఉచ్చ కమిటీ అధ్యక్షులు మహేష్ డిమాండ్ చేశారు.
ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువజన సంఘాలు, మాదిగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్జివన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బుక్కపురం మహేష్ మాట్లాడారు.. డా. బాబు జగ్జివన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన జీవితమంతా సామాజిక న్యాయం కోసం అంకితం చేశారని, కుల వివక్ష నిర్మూలనలో ఆయన చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు. నేటి సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరు డా. బాబు జగ్జివన్ రామ్ ఆశయాలను అనుసరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీలకర్ర సాంబశివరావు, మాచారం వెంకటేష్ ,కాశిం, మస్తాన్, శంకర్, పోలె రవి, జగదీష్, పుల్లగుర్ల వెంకటయ్య, ఆంజనేయులు ,రాజు ,కొండల్, సురేష్ మాదిగ సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.



