Monday, April 6, 2026
E-PAPER
Homeదర్వాజగ్లోబలీకరణ

గ్లోబలీకరణ

- Advertisement -

నీ కింకా అర్థం కాలేదా..?
మన ఆహార వ్యవస్థను ద్వంశం చేయడానికే
వాడి పిజ్జాలు, కె జీ ఎఫ్‌ లు తరలి వచ్చాయని,
మన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే
వాడి కార్పొరేటు బళ్ళు, యూనివర్సిటీలు బయలు దేరాయని,
మన అనువంశిక ఆరోగ్య రక్షణ క్రమాన్ని కబళించడానికే
వాడి బహుళజాతి మందుల కంపెనీలు మొలుచుకొచ్చాయని ,
మన సంసార జీవన చక్రాన్ని విరిచేయడానికే
వాడి సాంస్కృతిక కాలుష్య కాసారం సెగలు చిమ్ముతోందని ,
నువ్వే బట్టకట్టాలో, ఏ భాష మాట్లాడాలో
ఏం తినాలో, ఎవరిని ద్వేషించాలో …
ప్రవచన కారులే చెబుతుంటారు .
మన అలీన విధానం ఓ విఫల ప్రయోగమని
అగ్ర రాజ్యానికి బాకా ఊదడమే నవీన విధానమనీ
మీడియాను జేబులో పెట్టుకున్న నాయకులు నమ్మిస్తుంటారు.
ఇక్కడ ఎవరు గెలవాలో,
ఎవరు పాలన చేయాలో ..
ప్రజలు కాదు నిర్ణయించేది,
వాషింగ్‌టన్‌ డి సి .
మన పాలకులు బుర్రలేని గొర్రెల్లా
వాడి ప్రాపకం కోసం పాట్లు పడుతుంటారు .
నీ మెదడుకు మేకులు కొడుతూ
నీ కష్టాలను, బ్రతుకు భారాన్ని దేవుడికి అంటకట్టి
కొత్త ప్రార్థనాలయాలను కడతారు,
నువ్వా దైవ దర్శనాల కాడా..
నదీ స్నానాల్లో తొక్కుకొని చస్తుంటావు,
జరిగే దోపిడి ఏదీ నీకు కనపడకుండా
భక్తి ఒక ఇనుప తెరలా నర్తిస్తుంది .
మొదట సాంస్కృతిక ప్రాభవాన్ని కోల్పోతావు,
తర్వాత రాజకీయంగా పరాధీనమౌతావు,
మన కాళ్ళకింది సార్వబౌమత్వం కరిగిపోయి
దేశ అస్థిత్వమే మాయమై పోతుంది ,
పాలకులంతా విదేశాల్లో కాపురం పెడతారు.
ప్రజలంతా అగ్ర రాజ్యానికి బానిసలుగా మారిపోతారు .

పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -