Monday, April 6, 2026
E-PAPER
Homeదర్వాజయుద్ధం చెప్పే నిజం!..

యుద్ధం చెప్పే నిజం!..

- Advertisement -

ఆకాశం నుండి రాలుతున్నది
అమృతం కాదు అగ్నికీలల మృత్యువు…
నేల మీద పారుతున్నది నీరు కాదు
పసిపిల్లల స్వచ్ఛమైన రక్తం!
శాస్త్రవేత్తల మేధస్సు క్షిపణిగా మారింది
రాజకీయాల స్వార్థం స్మశానాలు కడుతోంది
నిన్నటి వరకు నవ్వులు పూసిన వాడలు
నేడు శవాల దిబ్బలై, మూగబోయిన గోడలు.
యంత్రాల యుద్ధంలో ప్రాణానికి విలువ లేదు
మందుపాతరల మధ్య శాంతికి తావు లేదు
ఆయుధాల అరుపులు ఆగిపోయేది ఎప్పుడు?
ఈ లోకం మళ్ళీ మనిషిని ప్రేమించేది ఎప్పుడు?
గగనంలో గర్జించే ఇనుప పక్షులు,
భూమిపై మిగిల్చే కన్నీటి చరిత్రలు.
బాంబు పడితే నగరం మౌనమవుతుంది,
అమ్మ ఒడిలోని కలలు బూడిదవుతాయి.
సైనికుడి అడుగులో ధైర్యం ఉన్నా,
హృదయంలో ఇంటి జ్ఞాపకం.
గెలుపు కోసం సాగిన యుద్ధ మార్గం,
మానవత్వాన్ని మెల్లగా మింగేస్తుంది.
పిల్లల నవ్వులు శబ్దాల్లో మాయమై,
శాంతి పావురం భయంతో దాక్కుంటుంది.
యుద్ధం చెప్పే ఒకే నిజం …
విధ్వంసమే గెలుస్తుంది, మనిషి ఓడి’పోతాడు’

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008577834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -