Monday, April 6, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మెద‌డు అల‌సిపోతుందా

మెద‌డు అల‌సిపోతుందా

- Advertisement -

మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేయాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, జ్ఞాపకశక్తి వంటి మన మేధో సామర్థ్యాలనే కాకుండా, శరీరంలోని అన్ని విధులను కూడా పర్యవేక్షిస్తుంది. కానీ, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయం టున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలు తీవ్రమైన పని ఒత్తిడితో తమ ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టరు. దీని వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ క్రమంలో మన మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని హానికరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం!

మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, చురుగ్గా ఆలోచించడానికి మానసిక స్థిరత్వం కోసం ఆరోగ్యకరమైన మెదడును కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మన రోజువారీ కొన్ని అలవాట్లు కారణంగా మెదడు పనితీరు క్షీణిస్తుందంటున్నారు నిపుణులు. ఈ అలవాట్లను సకాలంలో గుర్తించకపోతే, అవి ఒత్తిడి, ఆందోళన, అల్జీమర్స్‌ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు.

నిద్రలేమి
మెదడు మరమ్మత్తుకు, జ్ఞాపకశక్తిని పదిలపరుచుకోవడానికి రోజు 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. దీర్ఘకాలిక నిద్రలేమి మెదడు కణాలను దెబ్బతీస్తుందం టున్నారు నిపుణులు. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావాని చెబుతున్నారు. రాత్రి నిద్ర మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు తెల్చి చెప్పాయి.

అధిక ఒత్తిడి
నిరంతర ఒత్తిడి మెదడులో ‘కార్టిసాల్‌’ స్థాయిలను పెంచుతుంది. ఇది నాడీ కణాలకు హాని కలిగించడమే కాకుండా, జ్ఞాపకశక్తి, నేర్చుకునే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. కనుక ఒత్తిడిని దూరం చేసుకునే మార్గాలను పరిశీలించాలి.
పోషకాహారం లేకపోవడం

జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు లేదా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల మెదడు నిర్మాణం, కణాల మధ్య కమ్యూనికేషన్‌ దెబ్బతింటుందం టున్నారు నిపుణులు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, బి-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు అందకపోవడం కూడా మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. కనుక కుటుంబ సభ్యుల గురించే కాకుండా మనం తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ద తీసుకోవాలి.

శారీరక శ్రమ లేకపోవడం
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్‌, పోషకాలు అందవు. ఇది మెదడు పనితీరు క్రమంగా తగ్గడానికి దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. వ్యాయామం జ్ఞాపకశక్తి, అభ్యాసానికి ముఖ్యమైన మెదడు నిర్మాణం పరిమాణాన్ని పెంచుతుందని, ఫలితంగా మెరుగైన జ్ఞాపకశక్తి లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి రోజూ మీ దినచర్యలో వ్యాయామం ఉండేలా ప్లాన్‌ చేసుకోవడం చాలా అవసరం.

డీ హైడ్రేషన్‌
తగినంత నీరు తాగకపోవడం వల్ల అలసటగా ఉండటం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు కలుగుతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి శరీరంలో తగినంత నీరు ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో నీటిని పుష్కలంగా తాగాలి. అలాగే చలి కాలంలో దాహం వేయక పోయినా కచ్చితంగా నీరు తీసుకోవాలి.

అధిక శబ్దం
హెడ్‌ఫోన్‌ల ద్వారా బిగ్గరగా సంగీతం వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడమే కాకుండా, మెదడు శబ్ద విశ్లేషణ సామర్థ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక శబ్దాల వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడును ప్రభావితం చేస్తుందని, తద్వారా స్ట్రోక్‌, చిత్తవైకల్యం, అభిజ్ఞా క్షీణత, న్యూరో డెవలప్‌ మెంటల్‌ డిజార్డర్స్‌, డిప్రెషన్‌, ఆందోళన రుగ్మత వంటి న్యూరోసైకియాట్రిక్‌ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మల్టీటాస్కింగ్‌
ఒకేసారి అనేక పనులను నిర్వహించడానికి ప్రయత్నించడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగు తుంది. ఇది ఏకాగ్రతను, ఉత్పాదకతను తగ్గిస్తుందట.

ఒంటరితనం
సాధారణంగా ఒంటరితనం నిరాశతో ముడిపడి ఉంటుంది. ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం లేదా ఇతరులతో కలవకపోవడం వల్ల మెదడు స్పందన సామర్థ్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఇది డిప్రెషన్‌, జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీయవచ్చట. ఒంటరితనం వల్ల అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది. అలాగే అభిజ్ఞా క్షీణతను వేగవంతం చేస్తుందని తెలిపింది.

అల్పాహారం మానేయడం
రోజంతా మెదడు చురుగ్గా ఉండటానికి అల్పాహారం ఇంధనంలా పనిచేస్తుంది. ఈ క్రమంలో మార్నింగ్‌ టైం బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏకాగ్రత, ఆలోచనా శక్తిపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -