Monday, April 6, 2026
E-PAPER
Homeసినిమాయూనిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌

యూనిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

మలయాళ సినిమా తన సహజమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్రశ్రేణి మలయాళ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ప్రముఖ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. ‘మిన్నల్‌ మురళి’ ఫేమ్‌ బాసిల్‌ జోసెఫ్‌, అల్లు అర్జున్‌తో ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా, ‘కిష్కింధ కాండం’, ‘ఏకో’ చిత్రాలతో పేరొందిన దిన్‌జీత్‌ అయ్యతన్‌, ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో యూనిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వస్తోంది. గతంలో మలయాళ-తమిళ ద్విభాషా థ్రిల్లర్‌ మమ్ముట్టి ‘స్ట్రీట్‌ లైట్స్‌’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్‌ షామ్‌దత్‌, ఇప్పుడు ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

వి.చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం 2 గా నిర్మిస్తున్నారు. ఆదివారం హీరో విజరు సేతుపతి ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను ఆవిష్కరించారు. ‘డోంట్‌ స్లీప్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అలరించనుంది.
ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌ లో రవీంద్ర విజరు పాత్ర, తుపాకీతో మంచు పర్వతాల మీదుగా ఇంద్ర రామ్‌ను వెంబడిస్తుండగా, ముందు భాగంలో హీరో కళ్ళు మూసుకుని, నుదుటిపై కట్టుతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

ఎమోషనల్‌గా, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్‌ థ్రిల్లర్‌ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్‌ ప్రకటించారు.
ఇంద్ర రామ్‌, రవీంద్ర విజరు, తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్‌ థాపా, ఆడుకలం నరేన్‌, కల్ప లత, అనీష్‌ కురువిల్లా, వెన్నెల కిషోర్‌, నాగి జబర్దస్త్‌, డాక్టర్‌ భద్రమ్‌, రఘుబాబు తదితరులు.నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌, డీఓపీ : షామ్‌దత్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సజీర్‌ బాబా, లూనా జబిన్‌, నిర్మాత: వి చూడామణి, సంగీతం: గోకుల్‌ హర్షన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: మోనికా రామకృష్ణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -