ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతామో చాలా ఇన్నోవేటివ్‌గా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు. ఎస్.జె. సూర్య మరో హైలైట్. ట్రైలర్‌లో చూపింది చాలా తక్కువే. థియేటర్స్‌లో సినిమా మామూలుగా వుండదు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. కతి ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా నటించింది. ప్రదీప్ అందరికీ నచ్చే హీరో. ఎందుకంటే అతను మనలో ఒకడిలా అనిపిస్తాడు. అతని నటన చాలా రియల్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా అతని కెరీర్‌లో మరో పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
‘ప్రదీప్ ”లవ్ టుడే” సినిమా చూసినప్పుడే ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అనిపించింది. అందుకే తెలుగులో రిలీజ్ చేశాం. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రదీప్ హీరోగా, డైరెక్టర్‌గా వరుస విజయాలు సాధిస్తున్నాడు. విఘ్నేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు. ఈ సినిమా కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ రోజుల్లో ప్రేమ కథ తీయడం చాలా కష్టం. అలాంటి సమయంలో అందరికీ రిలేట్ అయ్యేలా, ఒక అప్లికేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ తీసారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ,’ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం—అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేదాన్ని వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా’ అని తెలిపారు.
సరికొత్త కాన్సెప్ట్
- Advertisement -
- Advertisement -



